Indukuri Raghu Raju Mlc Post: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని శాసనమండలి పునరుద్ధరించింది. జూన్ 3నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసినట్లు మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మంగళవారం సభకు కూడా హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో అనర్హత వేటు.. హైకోర్టు కీలక తీర్పుతో మళ్లీ పదవి వచ్చింది.