APSRTC Employees Gratuity: ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిమితి లేని గ్రాట్యుటీ చెల్లించేలా ఆదేశాలు వచ్చాయి. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ఆర్టీసీ ఎండీని రిక్వెస్ట్ చేయగా.. ఆయన ఫైల్ సిద్ధం చేసి పంపించారు. ఈ మేరకు ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో ఖజానాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు జిల్లాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ వివరాలు ఇలా ఉన్నాయి.