Nature cure medical college hospital in Vizag: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రులు నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. విశాఖపట్నం, కాకినాడలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలోని తొలిసారిగా నేచర్ క్యూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ విశాఖపట్నంలో నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు.