Visakhapatnam Thati Munjalu Availabe In November: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. ఎండాకాలంలో రావాల్సిన తాటి ముంజలు నాలుగు నెలల ముందుగానే, నవంబర్‌లోనే రోడ్లపై దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నంలో ఈ దృశ్యం కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. తోటల్లో ముందుగా కాసే పైరుకాపు ఉత్పత్తుల వల్లే ఇలా జరుగుతోందని కొందరు చెబుతున్నారు. గతేడాది కూడా డిసెంబర్ నెలలో తాటి ముంజలు, మామిడి పండ్లు విక్రయించారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ నెలలో మామిడి పండ్లు వస్తాయని భావిస్తున్నారు.