Building Structures and Layouts Permissions In AP: భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వీటికి అనుమతులు మంజూరు చేసే అధికారం పట్టణాభివృద్ధి సంస్థలకు ఉండేది. అయితే ఇప్పుడు భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర, గ్రామ పంచాయతీలకు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే నగర పంచాయతీల్లో లేఅవుట్ల విస్తీర్ణం మూడు ఎకరాలు దాటితే టీడీసీపీ అనుమతి తప్పనిసరి చేశారు.