Andhra Pradesh Weather High Temperatures Today: ఏపీలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి. 15 మండలాల్లో తీవ్రంగా, 90 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6, నంద్యాల జిల్లా ఆలమూరులో 42.5, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.1, అన్నమయ్య జిల్లా వతలూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ 35 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.