AP 500 New Ev Vehicle Charging Stations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 'సర్వోటెక్' సంస్థ ఈ విషయంలో కీలక పాత్ర పోషించనుంది. పెట్రోల్ బంకులు, హోటళ్లలో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు రానున్నాయి. కొత్తగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది.