Andhra Pradesh Free bus Scheme: ఏపీవ్యాప్తంగా ఉచిత బస్సు పథకానికి అద్భుత స్పందన లభిస్తోంది. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కుటుంబానికి ఒక్కరోజే స్త్రీ శక్తి పథకం ద్వారా రూ.1160 లబ్ధి చేకూరింది. ఈ విషయాన్ని టీడీపీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆ కుటుంబానికి జారీ చేసిన జీరో ఫేర్ టికెట్ షేర్ చేసింది.