ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో చేపట్టిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటులో సమస్యలు ఉన్నాయంటూ.. వారి పరిష్కారం కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా, మండలం, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ మంత్రివర్గ ఉప సంఘం బుధవారం తొలిసారిగా సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం సెప్టెంబర్ 15వ తేదీ నాటికి సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించాలని నిర్ణయించారు.