Andhra Pradesh July Record Gst Collection: ఈ ఏడాది జులైలో రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధిక రాబడిని పొందింది. 2018 నుంచి 2025 వరకు జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. గత జులై నెలలతో పోలిస్తే ఈ జులైలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి. స్థూలంగా చూసినా, నికరంగా లెక్కించినా ఇదే రికార్డు అని అధికారులు తెలిపారు. ఈసారి జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది.