Ap Govt Credit Salary To Employees: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఠంఛన్‌గా ఆగస్టు 1న జీతాలు పడ్డాయి.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమ చేస్తున్నారు. జులై నెలలోనూ ఒకటో తేదీనే జీతాలు జమ చేసిన సంగతి తెలిసిందే. ఒకటో తేదీన జీతాలు పడటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందంలో ఉన్నారు. ఓ ఉద్యోగి ఆనందం వ్యక్తం చేస్తున్న వీడియోను మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.