ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు.. నన్ను చూసి చంద్రబాబు భయపడుతున్నాడు: వైఎస్ జగన్

1 year ago 29
నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు తనను చూసి భయపడుతున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. తనను చూసేందుకు వస్తున్న ప్రజలను అడ్డుకునేందుకు వేలాది మంది పోలీసులను మోహరించారని దుయ్యబట్టారు. తప్పుడు కేసులతో వైఎస్సార్ సీపీ నేతలను వేధిస్తున్నారని, టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని జగన్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.
Read Entire Article