రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా కారవాన్ పార్కులు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. ఏపీ కారవాన్ టూరిజం పాలసీలో భాగంగా కొన్నిచోట్ల కారవాన్ పార్కులు అభివృద్ధి చేయనున్నారు. వీటి ద్వారా సందర్శకులను ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు ఆకర్షి్ంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ పాలసీకి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.