Bhogapuram Green Field International Airport Works: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.. తాజాగా అసెంబ్లీలో ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ అంశంపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్ అంశాన్ని ప్రస్తావించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 2026 కంటే ముందే పూర్తవుతాయి అన్నారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు మంత్రి నారాయణ ఈ అంశంపై సమాధానం ఇచ్చారు.