Visakhapatnam Raipur Greenfield Express Way: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హైవే, ఎక్స్‌ప్రెస్ వేలు, బైపాస్‌లు, ఫ్లై ఓవర్ల పనుల్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో విశాఖ-రాయపూర్ హైవే పనుల్లో భాగంగా సబ్బవరం సమీపంలో కూడలి పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులు పెదనాయుడు చెరువులో జరుగుతున్నాయి. ఈ చెరువు పూడ్చి వేయడంపై స్థానికులు, రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న ఎక్స్‌ప్రెస్ వే పనుల్ని అడ్డుకున్నారు.