Tirupati Hyderabad National Highway 167k Works: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు వైపు వెళ్లే NH 167-కె పనులు ఊపందుకున్నాయి. ఈ జాతీయ రహదారి కనుక పూర్తయితే, నంద్యాల, కడప జిల్లాల నుంచి హైదరాబాద్‌కు దూరం 70 కి.మీ తగ్గుతుంది. బెంగళూరు, తిరుపతి ప్రయాణాలకు కూడా మార్గం సులభతరం అవుతుంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గి, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి అంటున్నారు.