NTR Bharosa Pension Scheme Fake Applications Goes Viral: ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.