ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాసులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దశాబ్దపు నాటి కల సాకారం కానుంది. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. సాగరమాల 2 ప్రాజెక్టు కింద కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ హామీ ఇచ్చారు. అయితే కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం అవసరమైన 40 ఎకరాల భూమిని గుర్తించాలని ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్ కోసం త్వరలోనే భూసేకరణ మొదలెట్టనున్నారు. కేంద్రం నిర్ణయంతో మత్స్యకారులకే కాకుండా ఇతర ఉపాధి అవకాశాలు కూడా మెరగవుతాయని భావిస్తున్నారు.