Errupalem To Amaravati New Railway Line Land Acquisition: ఏపీ రాజధాని అమరావతి మీదుగా నిర్మించబోయే కొత్త రైల్వేలైన్‌కు కీలక ముందడుగు పడింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ మొదలైంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని గ్రామాల్లో రైల్వే, రెవెన్యూ అధికారులు భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఈ మేరకు రైతులు అధికారులకు కొన్ని రిక్వెస్ట్‌లు చేశారు.