Nadikudi Srikalahasti Railway Line Land: ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలకమైన రైల్వే లైన్ పనులు వేగవంతం కానున్నాయి. ఈ మేరకు ప్రకాశం జిల్లాలో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. జిల్లాలో భూసేకరణ సమస్యలు పరిష్కారం కావడంతో రైలు మార్గం నిర్మాణం వేగవంతం కానుంది. ఈ రైల్వే లైన్ పల్నాడు, పశ్చిమ ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి కీలకం కానుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి దూరం తగ్గి ప్రయాణం సులభమవుతుంది. త్వరలో మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.