Kotipalli Narasapuram Railway Line Update: ఏపీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రైల్వే పనుల్ని అధికారులు వేగవంతం చేశారు. కోనసీమవాసుల ఎన్నో ఏళ్ల కలగా ఉన్న కోటిపల్లి రైల్వే లైన్‌కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ మేరకు ఆ భూముల్లో స్తంభాలను పాతుతున్నారు. ఈ పనుల్ని మరింత వేగవంతం చేసి ఈ కొత్త రైల్వే లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా రైల్వే అధికారులు అడుగులు వేస్తున్నారు.