Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ లెక్కలు విడుదల చేసింది. కొత్త మద్యం షాపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత భారీగా మద్యం విక్రయాలు పెరిగినట్లు తెలిపింది. గత 75 రోజుల్లో ఏకంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. బార్లు, వైన్స్‌ల ద్వారా జరిగిన మద్యం అమ్మకాలకు సంబంధించి.. ఈ ఏడాది లెక్కలను ఏపీ అబ్కారీ శాఖ అధికారులు తాజాగా గణాంకాలు ప్రకటించారు.