Tirupati Inter Model Rtc Bus Terminal Dpr: తిరుపతికి శ్రీవారి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ మేకు భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నగరంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ స్థానంలో ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు రూ.470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ బస్ టెర్మినల్ నిర్మాణాన్ని ఈపీసీ విధానంలో నిర్మించాలని అధికారులు నివేదికను పంపారు.