Dornala New Rtc Bus Stand: ఏపీ ప్రభుత్వం కొత్తగా మరో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. శ్రీశైలం వెళ్లే భక్తులకు కీలకమైన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాలలో బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.40లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ నెల 21న కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దోర్నాలవాసుల 30 ఏళ్ల కల నెరవేరబోతోంది.. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇబ్బందులు తొలగిపోతాయి.