Amaravati ACA International Cricket Stadium: అమరావతిలో పనులు స్పీడ్ అందుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ పనుల్ని మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలోని నవలూరు దగ్గర క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం పనులు 90శాతం పూర్తియ్యాయని మున్సిపల్‌శాఖ అధికారులు ఓ వీడియోను ట్వీట్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.