Andhra Pradesh 30 Districts Creation: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో రెండు రోజులుగా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటూ రెండు, మూడు జిల్లాలను రద్దు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల రద్దు అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్వీట్ చేసింది.