Tirupati Chennai National Highway 205 Widening: ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నేషనల్ హైవే - 205 విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. పుత్తూరు బైపాస్ నుంచి నగరి మీదుగా తమిళనాడులోని తిరుత్తణి వరకు ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రమాదాలకు నిలయమైన కన్నామిట్ట ప్రాంతంలోనూ భద్రత మెరుగుపడుతుంది. రూ.864 కోట్లతో జరుగుతున్న ఈ పనులు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయి.