Tirupati Hyderabad Highway 167K: తెలుగు రాష్ట్రాల మీదుగా నేషనల్ హైవే 167కే పనులు మరింత వేగవంతం అయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే పనులు ప్రారంభంకాగా.. నంద్యాల జిల్లాలో కూడా భూ సేకరణ, రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఆ వెంటనే పనుల్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు అలైన్‌మెంట్, భూ సేకరణ అంశాలపై హైకోర్టును ఆశ్రయించారు.. అక్కడ భూ సేకరణపై స్పష్టత రాలేదు.