Piduguralla Vadarevu Highway 167A: ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతో అయ్యాయి. మొత్తం 82 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.1851 కోట్లు కేటాయించింది. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు ఒక ప్యాకేజీగా.. అలాగే చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు మరో ప్యాకేజీగా నిధులు కేటాయించారు. బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలో పనుల్ని వేగవంతం చేశారు. రోడ్డుతో పాటూ ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు.