ఏపీలో రహదారి విస్తరణ పనులు, రహదారి ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అనేక ప్రాజెక్టుల్లో వేగం పెరిగింది. తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లోనూ ఏపీలోని రహదారి ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఏపీలోని 142 రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.6038 కోట్లు కేటాయించింది. ఈ వివరాలను కేంద్ర రోడ్లు, రవాణా శాఖ వెల్లడించింది. వాడరేవు చిలకలూరిపేట రహదారి పనులకు రూ.250 కోట్లు కేటాయించినట్లు తెలిసింది.