ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో ఐదు చోట్ల కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోనూ కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళంలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టెక్నో ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్టు తయారీ కోసం ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తోంది.