ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి హోసూరు మీదుగా బెంగళూరుకు హైవే నిర్మించనున్నారు. నాలుగు వరుసలుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరగనుంది. మూడు ముఖ్యమైన ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచటంతో పాటుగా, ప్రయాణ సమయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రూపకల్పన చేసింది. తాజాగా డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు. జూన్ మూడో తేదీన బిడ్లు ఓపెన్ చేయనున్నారు.