ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రహదారి విస్తరణ పనులు, నూతన రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం సహకారంతో చాన్నాళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉన్న పనులు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే రాయచోటి చాగలమర్రి జాతీయ రహదారి పనుల్లో వేగం పెరిగింది. నాలుగేళ్ల కిందట ఈ రహదారి విస్తరణ పనులు మొదలుకాగా.. నత్తనడకన సాగుతూ వచ్చాయి. అయితే మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో పనుల్లో వేగం పెరిగింది. రెండు నెలల్లో పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు.