Kasibugga Flyover: ఏపీలో రైల్వేగేట్లతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎట్టకేలకు మోక్షం దక్కనుంది. ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడంతో రాకపోకల సమయంలో పడుతున్న కష్టాల నుంచి గట్టెక్కనున్నారు. జాతీయ రహదారి ఆధునికీకరణ జరిగినప్పటికీ వీటి నుంచి మోక్షం దక్కలేదు. ముఖ్యంగా పలాస నియోజకవర్గాల పరంగా కొన్ని ప్రధాన రైల్వే గేట్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కాశీబుగ్గ ఫ్లై ఓవర్‌కు సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది.. రూ.46.64 కోట్లు ఇస్తున్నారు.