ఏపీకి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. కొత్తగా మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాజమండ్రిలోని దివాన్ చెరువు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు, రూ.327 కోట్ల రూపాయల వ్యయంతో 2.55 కిలోమీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు తెలిసింది. దీంతో కాకినాడ, విశాఖపట్నం వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉండనుంది. మరోవైపు ఈ ప్రాంతవాసుల కోరిక మేరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు.