ఏపీలో మరో కొత్త బైపాస్ రోడ్డు రానుంది. రాష్ట్రంలో మౌలిక వసతుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరోచోట బైపాస్ రోడ్డు నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీనికి తోడు గ్రానైట్ లారీలు నగరంలోకి ప్రవేశిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలకు ఆంటకం కలుగుతోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒంగోలు వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒంగోలు పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రెండు మార్గాలను ఆలోచిస్తున్నారు.