ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులకు రైల్వే అనుసంధానం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ ప్రతిపాదనల ద్వారా రెండు పార్కులను మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులుగా అభివృద్ధి చేయొచ్చు. ఓర్వకల్లులో దూపాడు నుండి బేతంచర్ల వరకు, కృష్ణపట్నంలో 12 కి.మీ మేర రైల్వే లైన్ విస్తరణకు మంత్రి విజ్ఞప్తి చేశారు.