Gudur Sullurupeta New Railway Line: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌తో పాటు, ఏపీకి 26 కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు ప్రాజెక్టులు కేటాయించారు. చెన్నై-తిరుపతి, చెన్నై-గూడూరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రవాణా వ్యవస్థ మెరుగుపడి, ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. డిసెంబర్ నాటికి డీపీఆర్‌లు సిద్ధం చేయాలని నిర్ణయించారు.