Ntr Bharosa Scheme Widow Pensions Soon: ఏపీలో పింఛన్లకు సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రంలో వితంతు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కేటగిరీలో 2.20 లక్షల మంది అర్హుల గుర్తించామని తెలిపారు. ఈ పింఛన్లకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హుల కేటగిరీలో 7,856మంది పింఛన్లు తొలగించామన్నారు. అవి తప్ప ఎవరి పింఛన్లు తొలగించలేదన్నారు మంత్రి శ్రీనివాస్.