Ntr Bharosa Pension Spouse Category Amount: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ నెలలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్పౌజ్ పింఛన్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ మరుసటి నెలే భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఆ ప్రక్రియను ప్రారంభించారు.. ఈ నెలలో వారికి కొత్తగా పింఛన్‌ను పంపిణీ చేయనున్నారు.