AP Govt LPG Cylinder Delivery Charges: ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక. సిలిండర్ డెలివరీకి రశీదులోని డబ్బు మాత్రమే చెల్లించాలని, అదనపు ఛార్జీలు ఇవ్వవద్దని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి 1967, 1800 2333555 టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. 5 కిలోమీటర్లలోపు ఉచిత డెలివరీ ఉంటుందని, ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.