ఏపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీలను విభజించడం, విలీనం చేయడం, పురపాలికల్లో కలపడం వంటి మార్పులకు ఈ తాజా ఉత్తర్వులు అవకాశం కల్పించాయి. ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యుల తీర్మానాలు, గ్రామ సభల ఆమోదంతో ఈ ప్రక్రియ కొనసాగనుంది.