ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. ప్రముఖ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ చెమ్‌వోల్ట్ గ్లోబల్ ఏపీలో పెట్టుబడులు పెట్టనుంది. రూ.2500 కోట్లతో 5 GWh సామర్థ్యం గల లిథియం అయాన్ సెల్ తయారీ గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి చెమ్‌వోల్ట్ గ్లోబల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1500 మందికి ప్రత్యక్షంగా,4 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.