Ap Student Uniform Rates Hike: ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. చేనేతలకు లబ్ధి కలిగేలా.. సంక్షేమ శాఖల వసతి గృహాలు, గురుకులాలు, ఎయిడెడ్, ప్రభుత్వ పరిధిలోని ఇతర సంస్థల విద్యార్థుల యూనిఫామ్‌ను చేనేత కార్మికుల నుంచి సేకరించి అందించే లివరీ రకం ధరలను 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏటా 10శాతం పెంచేందుకు అనుమతించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కూడా జారీ చేశారు. ఈ మేరకు ఆప్కోకు అనుమతి ఇచ్చారు.