Thalliki Vandanam Scheme Ensure Following Things: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లులకు ఆర్థిక సహాయం అందించే 'తల్లికి వందనం' పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనుంది. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేయనున్నారు. అయితే, లబ్ధిదారులు హౌస్ డేటా బేస్‌లో పిల్లల వివరాలు నమోదు చేసుకోవడం, ఈ-కేవైసీ పూర్తి చేయడం, అలాగే ఆధార్‌తో ఎన్‌పీసీఐ లింక్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది.