Andhra Pradesh Hyacinth Compost: పశ్చిమ గోదావరి జిల్లాలో వినూత్న ప్రయోగం చేపట్టారు. పంట కాలువల్లోని గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో, డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది రైతులకు సమస్యను తీర్చడంతో పాటు మహిళలకు ఉపాధినిస్తుంది. ఈ ఎరువు సాధారణ ఎరువు కంటే నాణ్యంగా ఉంటుందని, కిలో రూ.12 నుంచి రూ.15 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. త్వరలో జిల్లాలో 100 యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.