ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం సేకరణ సజావుగా సాగుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోపే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను అడిగి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ధాన్యం అమ్మకాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల.. రోడ్లపై ఆరబోసిన వరిధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు కీలక సూచనలు చేశారు.