Four Mega Railway Terminals In Andhra Pradesh: రైల్వేశాఖ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నాలుగు మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే.. రైల్వేశాఖ టెర్మినల్స్ నిర్మించి నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకుంటుంది. ఈ మేరకు విశాఖపట్నం, అమరావతి, గన్నవరం, తిరుపతిలో ఈ టెర్మినల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. భూముల కేటాయింపుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. ఈ టెర్మినల్స్ అందబాటులోకి వస్తే రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.