బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ ఇప్పటి వరకు తేలలేదు. వేటకు వెళ్లిన గంట సమయం నుంచే వారితో కమ్యూనికేషన్ కట్ అయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకూ గాలింపు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.