తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో హైదరాబాద్ కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 73.3 లక్షల మంది ఓటర్ల మందికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. అందులో 43 లక్షల మంది హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారని తేలడం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లే అత్యధికంగా ఉన్నారని తేలింది.